Instagram Reels Bangaram: ఇన్ స్టా గ్రాం రీల్స్ స్టార్ బంగారం శాంతికి బంపర్ ఆఫర్, సినిమాలో దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్,
సరదాగా స్టార్ట్ చేసిన రీల్స్, ఈ అమ్మడిని ఒక్కసారిగా స్టార్ రేంజుకు తీసుకెళ్లింది. అయితే తాజాగా జబర్దస్త్ స్టేజికి పరిచయం అయిన ఈ అమ్మడు, తన జీవితంలోని విషాదాన్ని యూట్యూబ్ చానెల్స్ తో పంచుకుంది.
ఇన్ స్టా గ్రాంరీల్స్ ఎందరో మట్టిలో మాణిక్యాలను స్టార్స్ గా మలిచింది. గతంలో టిక్ టాక్ ద్వారా చాలా మంది స్టార్స్ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఇన్ స్టా గ్రాం రీల్స్ ద్వారా కొత్త టాలెంట్ బయటకు వస్తోంది. అలాంటి కోవకు చెందినదే బంగారం అలియాస్ శాంతి. సరదాగా స్టార్ట్ చేసిన రీల్స్, ఈ అమ్మడిని ఒక్కసారిగా స్టార్ రేంజుకు తీసుకెళ్లింది. అయితే తాజాగా జబర్దస్త్ స్టేజికి పరిచయం అయిన ఈ అమ్మడు, తన జీవితంలోని విషాదాన్ని యూట్యూబ్ చానెల్స్ తో పంచుకుంది. తాజాగా ఈ అమ్మడు తనకు వరుసగా సినిమా చాన్సులు సైతం వస్తున్నాయని పేర్కొంది.
అయితే బంగారం శాంతిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఒక ఫ్యాన్సీ షాపులో పనిచేసే శాంతి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నది. అంతేకాదు ఆమె తల్లిని తన తండ్రి తరుపు బంధువులు, చంపేస్తామని బెదిరించారు. తన తండ్రి మతిస్థిమితం లేక ఇల్లు వదిలి పారిపోయి, తిరిగి రాలేదని చెప్పుకొచ్చింది.
గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్
ఇక తన తమ్ముడు వాటర్ క్యాన్స్ వేసి జీవనం గడుపుతున్నాడని, శాంతి తన జీవిత గాథను చెప్పింది. ఇక బంగారం కష్టాలను విన్న తర్వాత ఇఫ్పుడిప్పుడే తన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు టాలివుడ్ లోని చిన్న నిర్మాణ సంస్థలు ఆమెను అప్రోచ్ అవుతున్నాయి. త్వరలోనే బంగారం సినిమాల్లో కనిపించే చాన్స్ ఉందని తెలుస్తోంది.