Health Benefits of Coriander: ధనియాలు తింటే మగాళ్లకు కలిగే ప్రయోజనాలు ఇవే, మీకు అది బాగా రావాలంటే పొడితో ఏం చేయాలో తెలుసుకోండి

ధనియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Health Benefits of Coriander (Photo-Pixabay)

ధనియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

ప్రపంచం నెత్తిన మరో మహమ్మారి పిడుగు, రాబోయే రోజుల్లో 100 కోట్ల మంది కలరా వ్యాధి కోరల్లో చిక్కుకుంటారని యుఎన్ హెచ్చరిక

అజీర్తితో బాధపడేవారు ధనియాలు శుభ్రం చేసి తగినంత ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడిచేసి రోజూ ఆ పొడి వాడితే సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, కడుపు నొప్పి, తలనొప్పి, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. వేసవిలో ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement