Health Tips: రణపాల మొక్క లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

రణపాల మొక్క ఔషధాల గని ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.

ranapala

రణపాల మొక్క ఔషధాల గని. ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. ఈ రణపాల మొక్కలు ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,గుణాలు ఉంటాయి. ఇది మన తరచుగా వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రణపాల ఆకును డైరెక్ట్ గా తినవచ్చు లేదా కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని మనకు దెబ్బలు తగిలిన చోట గాయాలు తగిలిన చోట ఈ పేస్టును రాసుకున్నట్లయితే గాయాలు తొందరగా మానుతాయి. రణపాల ఆకుల్లో బీపీని తగ్గించే ఔషధ గుణం కూడా ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు. ఈ రణపాల ఆకుల కషాయాన్ని గనక తీసుకున్నట్లయితే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

షుగర్: షుగర్ పేషెంట్స్ కూడా ఈ రణపాల కషాయం సహకరిస్తుంది. ఇది మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.  కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను కషాయంగా చేసుకొని తింటే మీ క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి కిడ్నీ స్టోన్స్  సమస్య  కూడా తగ్గిపోతాయి.

జీర్ణశయ్య సమస్యలు: జీర్ణశయ్య సమస్యలతో బాధపడేవారు కడుపులో అల్సర్లు, అజీర్ణం, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు ఈ రణపాల ఆకుల కషాయాన్ని తీసుకున్నట్లయితే మీ జీర్ణాశయ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.

Health Tips: పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ...

మైగ్రేన్ : చాలామంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని తల పైన పట్టి లాగా పెట్టుకున్నట్లయితే మీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.

జుట్టు సమస్య : రణపాల ఆకులను తినడం ద్వారా లేదా కషాయం ద్వారా తీసుకోవడం ద్వారా మీ జుట్టు రాలడము తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి వారి కాలేయం దెబ్బతింటుంది. అలాంటివారు ఈ రణపాల కషాయాన్ని గనక తీసుకున్నట్లయితే మీ లివరు తిరిగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడంలో ప్రధమ పాత్ర పోషిస్తుంది.

ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నప్పుడు ఉండడం ద్వారా జలుబు, దగ్గు విరోచనాలు వంటి సమస్యను తగ్గించడంలో కూడా ఈ రణపాల కషాయం సహాయపడుతుంది. మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు వచ్చిన వారు ఈ రణపాల కషాయాన్ని తీసుకున్నట్లయితే తొందరగా తగ్గిపోతాయి. మూత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా ఈ రణపాల కషాయాన్ని తీసుకోవడం ద్వారా మేము నూతన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కామెర్లవాదితో బాధపడే వారు కూడా ఈ ఆకుల రసాన్ని తీసుకున్నట్లయితే తొందరగా వ్యాధిని నయమవుతుందని ఆయుర్వేద శాస్త్రంలో తెలుపబడింది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now