'Chaddi Gang' Caught on Camera: వీడియో ఇదిగో.. మణికొండలో 'చడ్డీ గ్యాంగ్' హల్‌చల్.. ఫెన్సింగ్ కట్ చేసి ఫ్లాట్‌లోకి దూరిన దొంగలు.. నగదు, వాచీలు చోరీ..
సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. నెక్నాంపూర్-మణికొండ సరిహద్దులోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించిన 'చడ్డీ గ్యాంగ్' ముఠా ఘాతుకానికి ఒడిగట్టింది.
'Chaddi Gang' Caught on Camera: సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. నెక్నాంపూర్-మణికొండ సరిహద్దులోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించిన 'చడ్డీ గ్యాంగ్' ముఠా ఘాతుకానికి ఒడిగట్టింది. సెప్టెంబర్ 27 (ఆదివారం) తెల్లవారుజామున సుమారు 3:20 గంటల ప్రాంతంలో ఆరుగురు సభ్యులు గల ఈ ముఠా అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి దోపిడీకి పాల్పడింది. వీడియో ఇదిగో.. తెలంగాణలో ఘోర అగ్నిప్రమాదం.. కష్టపడి దాచుకున్న రూ.20 లక్షలు, 4 తులాల బంగారు ఆభరణాలు క్షణాల్లో బూడిద..
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. దుండగులు అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఉన్న చెరువు (సరస్సు) వైపు కాంపౌండ్ కంచెను కట్ చేసి ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా సీ-బ్లాక్‌లోని ఒక ఫ్లాట్‌లోకి చొరబడి నగదు, ఐదు ఖరీదైన వాచీలు సహా ఇతర విలువైన వస్తువులను అపహరించారు. చోరీ చేసి పరారవుతున్న సమయంలో అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక మహిళ వారిని నిలదీయగా, దుండగులు ఆమెపై తీవ్రంగా ప్రవర్తించి ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన నివాసితులు వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'Chaddi Gang' Caught on Camera:
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలు వచ్చి వెళ్లిన మార్గాలు, వారి కదలికలను గుర్తించేందుకు అపార్ట్‌మెంట్‌తో పాటు నెక్నాంపూర్, మణికొండ ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చడ్డీ గ్యాంగ్ ముఠాలు సాధారణంగా ముఖాలు కప్పుకుని రాత్రి వేళల్లో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.