Tollywood Heroine attack: కేబీఆర్ పార్క్‌లో టాలివుడ్ హీరోయిన్‌పై దాడి...ఖరీదైన సెల్ ఫోన్ లాక్కెళ్లిన దుండగులు, షాక్ లో హీరోయిన్..

నగరంలోని వీఐపీ జోన్ లో వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి చేసి సోల్ ఫోన్ లాక్కుపోయిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Representational Image | (Photo Credits: IANS)

హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న కేబీఆర్ పార్క్‌కు నిత్యం అనేక మంది వీఐపీలు వస్తుంటారు. అంతేకాదు సెలబ్రిటీలు కూడా ఇక్కడ వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అలాగే పార్క్ చుట్ట పక్కల రోడ్లు కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అటువంటి పార్క్ దగ్గర టాలివుడ్ హీరోయిన్ షాలు చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమె దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ లాక్కుని వెళ్లారు.

అయితే నగరంలోని వీఐపీ జోన్ లో వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి చేసి సోల్ ఫోన్ లాక్కుపోయిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ కోసం పార్కుకి వెళ్లిన టాలీవుడ్ నటి, మోడల్ షాలు చౌరాసియాపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించగా చౌరాసియా తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. రాత్రివేళ కావడంతో పార్కులో జనసంచారం తక్కువగా ఉండటంతో ఆమెకు ఎవరు కనిపించలేదు. పార్క్ లో ఎవరు లేని సమయాన్ని చూసుకుని ఒంటరిగా ఉన్న చౌరాసియాపై కన్నేసిన దుండగుడు ఆమెను అడ్డగించి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు.

ఈ ఘటనలో నటి చౌరాసియా గాయాలపాలైంది. వెంటనే ఆమె పోలీస్ కంట్రోల్ రూం 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన కేబీఆర్ పార్క్‌కి చేరుకున్న పోలీసులు చౌరాసియాను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నటి చౌరాసియా కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అన్నట్లు చౌరాసియా ఓ పిల్లా నీల్ల, అరణ్యంలో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Share Now

Tags

Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement