Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో
అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం(Plane Crash)లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది
Brazil, AUG 09: బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం(Plane Crash)లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై 29వ తేదీన జరిగిన ప్రమాదంలో.. 42 ఏళ్ల గేరన్ మాయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్‌కో మాయా ప్రాణాలు కోల్పోయారు. అడవిలో ఆ విమానం కూలింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆ ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు జరిగిందా లేదా గతంలో తీసిన వీడియోనా అన్న విషయం తేలలేదు.
మాయా బీరు తాగుతున్న సమయంలో.. అతని కొడుకు విమాన కంట్రోలింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విమానాన్ని ఎలా నడపాలో కూడా తన కుమారుడికి ఆ తండ్రి నేర్పుతున్నట్లు వీడియోలో ఉంది. ప్లేన్ కంట్రోలింగ్ గురించి తాగుతూ వివరించాడు.