Dinosaur Killer Asteroid: డైనోసార్లను నాశనం చేసిన అరుదైన గ్రహశకలం గుర్తింపు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి డైనోసార్ల జాతిని పూర్తిగా అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం గురించిన ఒక అద్భుతమైన నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా వెలికితీసింది.

Dinosaur Killer Asteroid

Dinosaur Killer Asteroid: సౌర వ్యవస్థలోనే అత్యంత పురాతనమైన, అరుదైన 'CO కాండ్రైట్' (CO Chondrite) రకానికి చెందిన అంతరిక్ష శిల వల్లే ఈ వినాశనం సంభవించిందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (UBC), పారిస్, బ్రస్సెల్స్, వియన్నా పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయన వివరాలు ప్రముఖ సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆనాటి ప్రళయం తర్వాత ఏర్పడిన పలుచని మట్టి పొరలో పదిలంగా ఉన్న నికెల్ ఐసోటోప్‌లను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. 6.6 కోట్ల ఏళ్ల క్రితం సుమారు 10 కిలోమీటర్ల వెడల్పున్న ఈ భారీ గ్రహశకలం మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని ఢీకొట్టి, అతిపెద్ద చిక్సులబ్ బిలాన్ని ఏర్పరచడంతో పాటు భూగ్రహంపై ఉన్న 75 శాతం జీవజాలాన్ని తుడిచిపెట్టేసింది.

షాకింగ్ వీడియో ఇదిగో, యూపీలో ఫేక్ అంత్యక్రియలకు యత్నించిన ముగ్గురు అరెస్ట్, బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి, మరో ఇద్దరు వ్యక్తులు

ఈ తీవ్ర ఘాతానికి శక్తివంతమైన భూకంపాలు, రాకాసి సునామీలు, కార్చిచ్చులు చెలరేగాయి. వాతావరణంలోకి దట్టంగా అలముకున్న ధూళి, వాయువులు కొన్నేళ్ల పాటు సూర్యకాంతిని అడ్డుకుని భూమి పై వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పరిశోధన ప్రకారం.. భూమిపై లభించే గ్రహశకలాల అవశేషాల్లో ఈ 'CO కాండ్రైట్' రకం కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. ఇవి గురు గ్రహం సమీపంలోని బయటి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి లేదా సౌర వ్యవస్థ చివరి సరిహద్దుల నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

సాధారణంగా భావించేలా గ్రహశకలంలోని గంధకం (సల్ఫర్) కంటే కూడా.. దాని దాడి వల్ల ఆకాశంలోకి ఎగసిపడిన అతి సూక్ష్మ ధూళి కణాలే సూర్యకాంతిని పూర్తిగా కప్పివేసి ఈ వినాశనానికి ప్రధాన కారణమయ్యాయని పరిశోధకులు స్పష్టం చేశారు. విశ్వంలోనే అత్యంత అరుదైన ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం అప్పట్లో డైనోసార్ల దురదృష్టానికి నిదర్శనమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement