Egypt: ఇదెక్కడి దారుణం, కాబోయో భార్య పరీక్షల్లో ఫెయిల్ అవుతుందని తెలిసి ఏకంగా కాలేజీకే నిప్పు పెట్టాడు, మరో ఏడాది పెళ్లికి ఆగలేకే ఇలా చేశానని చెప్పిన యువకుడు

ఈజిప్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆ కాలేజీకే నిప్పు (Man Sets School On Fire) పెట్టాడు. ఈ ఘటనలో 21 ఏళ్ళ యువకుడిని ఈజిప్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Representational Image | (Photo Credits: IANS)

ఈజిప్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆ కాలేజీకే నిప్పు (Man Sets School On Fire) పెట్టాడు. ఈ ఘటనలో 21 ఏళ్ళ యువకుడిని ఈజిప్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ న్యూస్ ప్రకారం..ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్‌లో ఓ వ్యక్తికి తనకు కాబోయే భార్య చదువు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువకుడు సరేనన్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఆమె కచ్చితంగా ఫెయిల్ అవుతుందని (Bride-To-Be Would Fail In Exam) ఆ యువకుడికి తెలిసింది.

దీంతో మరో ఏడాది పాటు పెళ్లి కోసం వెయిట్ చేయాలని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.ఈ క్రమంలోనే తనకు కాబోయే భార్య చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి తన స్వగ్రామం సమీపంలో దాక్కున్నాడు. అయితే కాలేజికి నిప్పుపెట్టే సమయంలో అతన్ని చూసిన కొందరు.. ఆ యువకుడు ఎక్కడ ఉంది? ఎలా ఉండేది పోలీసులకు వివరించారు.

షాకింగ్ వీడియో, రైల్వే స్టేషన్‌లో మహిళ పక్కన నిద్రిస్తున్న పసిబిడ్డను ఎత్తుకెళ్లిన దొంగ, నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్‌ బృందాలు రంగంలోకి..

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తప్పును ఆ యువకుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.అగ్నిమాపక సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేయగలిగారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ప్రిన్సిపాల్ ఆఫీస్ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement