Extramarital Affair: మరిదిపై మనసుపడిన వదిన, పెళ్లైన నెలకే భర్త లేని సమయంలో మరిదితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది..

పెళ్లైన రెండు రోజులకే మరిదిపై మనసుపడింది నవవధువు. తాళికట్టిన భర్త, అత్తా మామలను వదిలేసి మరిదితో పరారైంది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న నగలు, నగదు కూడా ఎత్తుకెళ్లింది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(Photo Credits: Unsplash)

లక్నో, మార్చి 13: పెళ్లైన రెండు రోజులకే మరిదిపై మనసుపడింది నవవధువు. తాళికట్టిన భర్త, అత్తా మామలను వదిలేసి మరిదితో పరారైంది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న నగలు, నగదు కూడా ఎత్తుకెళ్లింది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని పురాన్ పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పురాన్ పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన యువకుడికి పిలిభిత్ కు చెందిన యువతితో వివాహమైంది. పెళ్లయ్యాక ఎన్నో ఆశలతో కొత్తకోడలు అత్తారింట్లో అడుగు పెట్టింది.

అందరితో కలివిడిగా ఉంటూ.. 30 రోజులకే మంచి కోడలు దొరికిందన్న పేరు తెచ్చుకుంది. అత్తామామలు, భర్త ఆ యువతిని చూసి సంబరపడిపోయారు. ఇంతలోనే ఊహించని షాక్ ఇచ్చింది. అదే కుటుంబానికి చెందిన వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో శారీరకంగా దగ్గరైంది. అప్పట్నుంచి భర్తను దూరం పెడుతూ.. మరిదికి దగ్గరైంది. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసినా.. వదినా మరుదులే కదా అని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరకు భర్తను వదిలేసి, నగదు, డబ్బుతో మరిదితో కలిసి పారిపోయింది. ఆమె ఇంట్లో కనిపించకపోవడంతో అందరూ కంగారుపడ్డారు. ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మరిదితో కలిసి పారిపోయిందని గ్రహించారు. బాధిత యువతి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement