Fight Breaks Out Between Passengers: విమానంలోనే ప్రయాణికుల ముష్టియుద్ధం, గాల్లోనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్న ప్యాసింజర్లు, థాయ్‌ ఎయిర్‌వేస్‌ వీడియో వైరల్‌ ఇదిగోండి!

విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూసుండం.. అయితే ఇక్కడ గొడవ జరిగింది సీటు కోసం కాదనుకోండి. అసలు లొల్లి ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. ఓ వ్యక్తి అదేనండీ విమాన ప్రయాణికుడు.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు (Fight Breaks Out Between Passengers). ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

Fight Breaks Out Between Passengers (PIC @ Screen Garb from viral video)

New Delhi, DEC 29: మనం బస్సులోనో, రైలు, ఆటోలోనే సీటు కోసం గొడవ పెట్టుకోవడం చూశాం. ఒకరినొకరు తన్నుకోవడం, కిటికీ సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకోవడమూ చూశాం. మరి విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూసుండం.. అయితే ఇక్కడ గొడవ జరిగింది సీటు కోసం కాదనుకోండి. అసలు లొల్లి ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. ఓ వ్యక్తి అదేనండీ విమాన ప్రయాణికుడు.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు (Fight Breaks Out Between Passengers). ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి అదికాస్త చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. నా ఫ్రెండ్‌ ను కొడతావా? అంటూ అతనికి మరికొందరు తోడవ్వడంతో గొడవ పెద్దదైంది.

థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్‌ స్మైల్‌ ఎయిర్‌వేస్‌ విమానం బ్యాంకాక్‌ నుంచి కోల్‌కతా (Bangkok to India) వస్తున్నది. విమానం గాల్లో ఉండగా.. ఓ అద్దాలు పెట్టుకున్న వ్యక్తి.. బ్లాక్ షర్ట్ వేసుకున్న మరో యువకుడితో గొడవకు దిగాడు (Airlines Flight). ఇద్దరు వాదులాడుకుంటున్నారు. ఇంతలో కళ్లజోడు పెట్టుకున్నన వ్యక్తి ఫ్రెండ్స్‌ అతనికి తోడయ్యారు. అంతా కలిసి బ్లాక్‌ షర్ట్ వేసుకున్న వ్యక్తిని కొట్టారు. వారిని ఆపడానికి విమాన సిబ్బంది ప్రయత్నించిన్నప్పటికీ.. గొడవ సద్దుమణగలేదు. ఇంత జరుగుతున్నా తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. మరికొందరు దీన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది తెగ షేరింగ్‌ అవుతున్నది. అయితే ఈ ఘటనపై థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement