IndiGo Flight Cancelled: వీడియో ఇదిగో..ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో లగేజ్ బెల్ట్‌పైకి ఎక్కిన మహిళ.. ఫ్లైట్ రద్దుతో సహనం కోల్పోయి ఇండిగో డెస్క్ వద్ద రచ్చ రచ్చ..

భువనేశ్వర్ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమానం రద్దు కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విమాన సర్వీస్ రద్దు కావడంతో గంటల తరబడి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఇండిగో గ్రౌండ్ సిబ్బందిపై ఒక మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడింది.

man Climbs On Luggage Belt, Hurls Papers At IndiGo Staff After Flight Cancelled (Photo Credits: X\@bishwamaurya_)

IndiGo Flight Cancelled: భువనేశ్వర్ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమానం రద్దు కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విమాన సర్వీస్ రద్దు కావడంతో గంటల తరబడి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఇండిగో గ్రౌండ్ సిబ్బందిపై ఒక మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..

విమానం రద్దు సమాచారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ, పరిమితులు దాటి నేరుగా లగేజీ బెల్ట్‌పైకి ఎక్కింది. ఆపై ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ డెస్క్‌పై ఉన్న కాగితాలు, ముఖ్యమైన పత్రాలను సిబ్బందిపైకి విసిరేస్తూ కేకలు వేసింది. గ్రౌండ్ సిబ్బంది ఆమెను శాంతింపజేసేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఆమె వినకుండా వారితో దురుసుగా ప్రవర్తించడం కొనసాగించింది. అదే సమయంలో ఈమె బిడ్డకు ఒంట్లో బాగోలేదు అని అక్కడ ఉన్న మరొక ప్రయాణికుడు చెప్పడం వీడియోలో వినిపించింది. తోటి ప్రయాణికులు కూడా జోక్యం చేసుకుని ఆమెకు నీళ్లు అందిస్తూ శాంతపరచడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె శాంతించలేదు.

Woman Climbs Luggage Belt, Confronts Staff at Bhubaneswar Airport

 

View this post on Instagram

 

A post shared by AVIATION NEWS (@aviationnews___)

పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో విమానాశ్రయ భద్రతా దళమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సదరు మహిళను అడ్డుకున్న సీఐఎస్‌ఎఫ్ జవాన్లు.. మీరు విమానాశ్రయ ప్రభుత్వ ఆస్తిని పాడు చేస్తున్నారు, మళ్లీ అక్కడికి వెళ్లవద్దు అని హెచ్చరిస్తూ ఆమెను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. సమయానికి విమానాలు రద్దు కావడం, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ప్రయాణికులు పడే తీవ్ర అవస్థలకు ఈ ఘటన అద్దం పడుతుండగా, విమానాశ్రయ ఆస్తిని పాడు చేయడంపై భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement