Helmet Challan: హెల్మెట్ ధరించనందుకు జరిమానా.. బైక్ నెంబర్ మాత్రమే కనిపించేలా ఫోటో అప్ లోడ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఇదే అదునుగా.. తగిన ఆధారం ఏదని, సాక్ష్యం చూపించే వరకూ ఫైన్ కట్టబోనని సోషల్ మీడియాకెక్కిన యువకుడు.. దీనికి ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా?

హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన ఓ యువకుడికి పోలీసులు చలానా విధించారు. వారు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించేది లేదంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో చూసిన ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లోనే స్పందించారు. మరో ఫొటోను పంపి ఇప్పుడేమంటావ్? అని ప్రశ్నించారు.

Helmet (Credits: Twitter)

Bengaluru, October 22: ట్రాఫిక్ (Traffic) పోలీసులకు (Police), ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ యువకుడికి మధ్య  సోషల్ మీడియాలో (Social Media) ఇటీవల జరిగిన ఓ సంభాషణ మినీ యుద్ధాన్నే తలపించింది. వీరిద్దరి ట్వీట్లను (Tweets) నెటిజన్లు (Netizens) బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే..  హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన ఓ యువకుడికి పోలీసులు చలానా విధించారు. వారు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించేది లేదంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో చూసిన ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లోనే స్పందించారు. మరో ఫొటోను పంపి ఇప్పుడేమంటావ్? అని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న యువకుడు.. ‘సరేలే కట్టేస్తా’ అంటూ రిప్లై ఇచ్చాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై దూసుకుపోతున్న ఫొటోను అతడికి పంపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అయితే, ఆ ఫొటోలో నంబరు ప్లేట్ మాత్రమే కనిపిస్తుండడంతో అతడు సోషల్ మీడియాకెక్కాడు. ట్రాఫిక్ పోలీసులు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. గతంలోనూ ఇలానే పంపితే పోనీలే అని జరిమానా చెల్లించానని, ఈసారి మాత్రం చెల్లించేది లేదన్నాడు. పూర్తి ఫొటో అయినా పంపాలని, లేదంటే కేసును అయినా వెనక్కి తీసుకోవాలని సూచించాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్-12కు జింబాబ్వే.. ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీలోనూ ఆడని జింబాబ్వే.. స్కాంట్లాడ్‌పై అద్భుత విజయం సాధించి రెండో దశలోకి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన క్రెయిగ్ ఇర్విన్

ఈ ట్వీట్ చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే పూర్తి ఫొటో పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. ఇది చూసిన యువకుడు పూర్తి ఫొటో పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ.. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నాడు. ఓ పౌరుడిగా తెలుసుకునే హక్కు ఉండడం వల్లే ప్రశ్నించానని అన్నాడు. ఆ తర్వాత తొలుత చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. పోలీసులు, యువకుడు మధ్య జరిగిన ట్వీట్ల పోరుపై నెటిజన్లు స్పందించారు. అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాకుండా ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడని, కాబట్టి మరింత ఎక్కువ ఫైన్ వేయాలని సూచించారు. పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై ఇంకా జరిమానా వేసే అవకాశం ఉంటే పరిశీలించాలని మరికొందరు కామెంట్ చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now