Nagpur Bank Robbery Video: వీడియో ఇదిగో.. ఉద్యోగం లేకపోవడంతో దొంగ అవతారం.. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి రూ. 4 లక్షలతో పారిపోతుండగా పట్టుబడిన B.Sc గ్రాడ్యుయేట్..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ యత్నం తీవ్ర కలకలం రేపింది. ఒక నిరుద్యోగి బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి, క్యాష్ కౌంటర్ నుంచి రూ. 4 లక్షల నగదుతో పరారవుతుండగా, బ్యాంక్ సిబ్బంది, పోలీసులు వెంటాడి అరెస్ట్ చేశారు.
Nagpur Bank Robbery Video: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ యత్నం తీవ్ర కలకలం రేపింది. ఒక నిరుద్యోగి బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి, క్యాష్ కౌంటర్ నుంచి రూ. 4 లక్షల నగదుతో పరారవుతుండగా, బ్యాంక్ సిబ్బంది, పోలీసులు వెంటాడి అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డవగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను B.Sc డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేక నిరుద్యోగిగా ఉంటున్నాడు. సూరజ్ సాధారణ వినియోగదారుడిలా బ్యాంక్‌లోకి ప్రవేశించి, నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. ఒక్కసారిగా తన వద్ద ఉన్న కారం పొడిని అక్కడ ఉన్న బ్యాంక్ సిబ్బంది కళ్లలో చల్లడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆ గందరగోళం మధ్య కౌంటర్ నుంచి రూ. 4 లక్షల నగదు తీసుకుని అతడు బయటకు పరుగులు తీశాడు. అయితే, బ్యాంక్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి, అక్కడే ఉన్న పోలీసులతో కలిసి నిందితుడిని వెంటాడారు. బ్యాంక్ శాఖకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల వ్యవధిలోనే అతడిని పట్టుకున్నారు.
Nagpur Bank Robbery Video:
పోలీసులు నిందితుడి వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం లేకపోవడం వల్లే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు భావిస్తున్నారు. ఈ నేరంలో వేరే ఎవరికైనా ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.