Mani Nagaraj: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..

తమిళ దర్శకుడు మణి నాగరాజ్‌ ఆకస్మిక మృతి.. కోలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి

Chennai, August 26: డైరెక్టర్‌ మణి నాగరాజ్‌ (Mani Nagaraj) గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) వద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నైతాండి వరుసవాయా చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ (G. V. Prakash Kumar), శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.

మాములుగా లేదుగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సన్నివేశం చూసి నవ్వులు చిందించిన వల్లభనేని వంశీ

జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను హీరోగా వెండితెరకు పరిచయం చేసింది ఈయనే. ప్రస్తుతం వాసువిన్‌ కర్ఫైణెగన్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. నాగరాజ్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement