Notices To Hanuman: తమ భూమిని ఆక్రమించాడని ఆరోపిస్తూ ఏకంగా హనుమంతుడికే నోటీసులిచ్చిన రైల్వే అధికారులు.. మధ్యప్రదేశ్ లో ఘటన
కొన్ని వార్తలు చదవగానే ఆశ్చర్యంతో పాటు కాస్త అసహనం కూడా కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. రైల్వే భూముల్ని ఆక్రమించాడని ఆరోపిస్తూ అధికారులు దేవుడికే నోటీసులు పంపిన విచిత్రమిది.
Bhopal, Feb 13: కొన్ని వార్తలు చదవగానే ఆశ్చర్యంతో పాటు కాస్త అసహనం కూడా కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. రైల్వే భూముల్ని(Railway Lands) ఆక్రమించాడని ఆరోపిస్తూ అధికారులు దేవుడికే నోటీసులు (Notices) పంపిన విచిత్రమిది. అవును! రైల్వే భూమిని హనుమంతుడు (Lord Hanuman) ఆక్రమించాడట. వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తదుపరి చర్యలు తప్పవంటూ మధ్యప్రదేశ్ లోని (Madhyapradesh) ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అధికారులు నోటీసులు పంపారు.
మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్వాలియర్-షియోపూర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైనుకు ఓ హనుమాన్ గుడి అడ్డంగా మారింది. దీంతో అధికారులు ఏ మాత్రం తడుముకోకుండా వెంటనే హనుమంతుడికి నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఈ నోటీసుల ప్రతి వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement