Trolls on Rashmika: ర‌ష్మిక‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న‌ముంబై వాసులు, అప్పుడు కాదు..ఇప్పుడొచ్చి చూడు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు

ఈ బ్రిడ్జికి తాజాగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ (Viral) అవుతున్నాయి. వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూ.18000 కోట్ల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి సంవ‌త్స‌రం కూడా కాక‌ముందే పగుళ్లు ఏర్పడ్డాయని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజ‌న్లు మండిపడుతున్నారు

Trolls on Rashmika

Mumbai, June 21: టాలీవుడ్ న‌టి రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ (Trolls on Rashmika) అవుతుంది. ర‌ష్మిక ఇటీవ‌ల ముంబైలోని అటల్ బిహారీ వాజపేయి (Atal Sethu) బ్రిడ్జ్‌ను పోగుడుతూ ఒక వీడియో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్‌ను చూపిస్తూ బీజేపీ (BJP) హాయంలో భార‌త‌దేశం రోజురోజుకి మరింత అభివృద్ధి చెందుతుందని ఈ వీడియోలో చెప్పుకోచ్చింది.

 

అయితే ఈ బ్రిడ్జికి తాజాగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ (Viral) అవుతున్నాయి. వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూ.18000 కోట్ల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి సంవ‌త్స‌రం కూడా కాక‌ముందే పగుళ్లు ఏర్పడ్డాయని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజ‌న్లు మండిపడుతున్నారు.

 

ఇక ఈ బ్రిడ్జిపై వీడియో చేసిన న‌టి రష్మిక మందన్న ఇప్పుడు ఎందుకు స్పందించ‌ట్లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement