Viral News: అతడు సమోసా, కచోరి అమ్ముకునే చిరు వ్యాపారి.. సంపాదించేది సంవత్సరానికి అక్షరాల రూ. కోటి

మీ కూతురు కోసం ఏ సాఫ్ట్‌వేరో, ఎన్నారై అనో వెతకకండి, ఏదైనా కచోరి, సమోసా సంబంధం వస్తే కళ్లు మూసుకొని అతడికిచ్చి పెళ్లి చేసేయండి. ఎందుకంటే...

Representational Image | Pixabay

Viral News:

మీరేం చేస్తుంటారు? సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? డాక్టరా? ఏడాదికి ఎంత సంపాదిస్తారు మీరు? కనీసం ఓ 20 లక్షలు ఉంటుందా మీ ప్యాకేజీ? 30 లక్షలు? పోనీ 50 లక్షలు వేసుకోండి. అయినా మీరు నథింగ్. వెంటనే మీ పోస్టుకు గుడ్ బై చెప్పేసి సమోసా, కచోరి అమ్ముకుంటే అది అన్నింటికంటే బెస్ట్.

తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాలని చూస్తున్న పేరేంట్స్ కు కూడా ఇదే చెప్తున్నాం. మీ కూతురు కోసం ఏ సాఫ్ట్‌వేరో, ఎన్నారై అనో  వెతకకండి, ఏదైనా కచోరి, సమోసా సంబంధం వస్తే కళ్లు మూసుకొని అతడికిచ్చి పెళ్లి చేసేయండి. ఎందుకంటే

కచోరి- సమోసా ద్వారా వచ్చే ఆదాయం హైప్రొఫెషనల్ కార్పోరేట్ ఉద్యోగి కంటే కూడా డబుల్, ట్రిపుల్ ఉంటుంది. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది ఇప్పుడే నీటిలో నానబెట్టి బయటికి తీసిన పచ్చి నిజం. కావాలంటే మీకో వ్యక్తిని పరిచయం చేస్తాను, చదవండి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (Uttar Pradesh) లోని అనే అలీఘర్ (Aligarh) పట్టణంలో సీమా సినిమా టాకీస్ దగ్గర 'ముఖేశ్ కచోరి' (Mukhesh Kachori) అనే ఒక సమోసాలు అమ్మే ఓ చిన్న షాప్ ఉంది. అఫ్‌కోర్స్ అది లోకల్ గా ఫేమస్సే. మార్నింగ్ షాప్ తీయగానే వేడివేడిగా సమోసాలు చేస్తారు. మరి అందులో ఏమేస్తారో ఏమోగానీ జనాలు ఆ సమోసాల కోసం ఎగబడతారు. రోజు గడిచిపోతున్నా, సమోసా కోసం 'క్యూ' తగ్గదు, సమోసాలు వేయడం ఆగదు.

రోజూ ముఖేశ్ షాప్ ముందు ఈ జనాలను చూసి ఫ్రస్ట్రేట్ అయిన ఓ మనిషి, ఇన్ కాం టాక్స్ (Income Tax) ఆఫీసర్లకు దీని సంగతేంటో చూడమని కంప్లైంట్ చేశాడు. దీంతో టాక్స్ ఆఫీసర్లు రంగంలోకి ముఖేశ్ కచోరి షాప్ కు రోజుకు ఎంతవరకు ఆదాయం, అలా ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడు అని లెక్కలు తీస్తే వాళ్ళ కళ్లు బైర్లు కమ్మాయి. వారు తేల్చిన లెక్క ప్రకారం ముఖేశ్ ఆదాయం ఏడాదికి కనీసం రూ. 60 లక్షల నుంచి రూ. కోటి వరకు, కొన్ని సందర్భాల్లో అంతకంటే కూడా ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

ఇంత సంపాదిస్తున్నా టాక్స్ కట్టడం లేదని అధికారులు అతణ్ని నిలదీయగా, అందుకు తాను 10 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నానని అసలు ఎంత సంపాదిస్తున్నానో ఎప్పుడు లెక్క చూసుకోలేదని సమాధానం ఇచ్చాడు.

రూ, 40 లక్షలు వార్షిక ఆదాయం దాటితే షాప్ ను జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలని, అలాగే 5% టాక్స్ కట్టాలని అధికారులు అతడికి నోటీసులు జారీచేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif