Spycam in Bathroom: ఫంక్షన్ హాల్ బాత్రూంలో రహస్య కెమెరా, 20 మంది యువతుల నగ్న వీడియోలు చిత్రించి, బ్లాక్ మెయిల్ చేస్తున్న దుండగుడు..

ఆ వీడియో అసలు కాపీ మీకు ఇవ్వాలంటే 5లక్షలు ఇవ్వండి. లేదంటే ఆ వీడియో కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతుందని బెదిరించాడు.

Cybercrime (Photo Credits: IANS)

అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఒక ఫంక్షన్‌ హాలులో ఆడంబరంగా ఒక పెళ్లి జరుగుతుంది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో పెళ్లి పెద్దకు రామకృష్ణ అనే యువకుడు ఫోన్‌ చేసి బాత్‌ రూంలో మీ కుటుంబంకు చెందిన 20 మంది ఆడవాళ్లు బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీశాం. ఆ వీడియో అసలు కాపీ మీకు ఇవ్వాలంటే 5లక్షలు ఇవ్వండి. లేదంటే ఆ వీడియో కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతుందని బెదిరించాడు. విషయం కొందరు బందువులకు తెలిసింది. దాంతో ఆడవారు ఆ వీడియో బయటకు వస్తే ఎక్కడ పరువు పోతుందో అని ఆందోళన చెందారు. ఆ సమయంలోనే రహస్యంగా పోలీసులకు ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు చాకచక్యంగా రామకృష్ణ మరియు అతడి టీంను పట్టుకున్నారు. పోలీసులు అతడి నుండి సదరు వీడియోను స్వాదీనం చేసుకుని నాశనం చేయడం జరిగింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి రోజు ముందే బాత్‌రూంలో ఎవరికి కనిపించకుండా సీసీ కెమెరాను బిగించినట్లుగా రామకృష్ణ విచారణలో చెప్పుకొచ్చాడు. ఇలాంటి దుర్మార్ఘుడిని ఏం చేసినా పాపం లేదని, ఆడవారితో ఆడుకునే అలాంటి వారికి తగిన శిక్ష పడాలంటూ మహిళలు కోరుతున్నారు. గతంలో కూడా రామకృష్ణ ఇలాంటి పని చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.



సంబంధిత వార్తలు