Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)

వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.

Husband Built Temple For Deceased Wife (Credits: X)

Hyderabad, Aug 9: వివాహం (Marriage) అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది. అయితే, బతికుండగానే కొందరు భర్తలు భార్యకు నరకం చూపిస్తున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం, ఇలాంటి దుర్భర దినాల్లో ఓ వ్యక్తి మాత్రం ఆదర్శంగా నిలిచాడు. ఇల్లాలే ప్రత్యక్ష దైవమని భావించి, తుదిశ్వాస విడిచిన ఆమె కోసం ఏకంగా గుడినే కట్టించాడు (Husband Built Temple For Deceased Wife). అంతేకాక సమాధిపై నిత్యం దీపం వెలిగిస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కనిపించింది.

‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్‌ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్ర‌ధాని మోదీ పిలుపు

మరణించిన భార్య కోసం..

గ్రామానికి చెందిన కుడికాల రమేశ్ భార్య సరస్వతి ఏడాది క్రితం మృతి చెందింది. దీంతో భార్య మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం భర్త సరస్వతి విగ్రహాన్ని చేయించి గుడి కట్టించాడు. రోజూ పూజలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా గతంలో జగిత్యాలలో, వరంగల్ లో కూడా చనిపోయిన తమ భార్యల కోసం ఇద్దరు వ్యక్తులు గుడి కట్టించిన విషయం తెలిసిందే.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement