Gang Rape: కంబైన్డ్ స్డడీస్ కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఇద్దరు యువతులపై, ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్, దారుణం

దీంతో వారు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

Representational Image (Photo Credits: File Image)

దేశంలో నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బీహార్ లో దారుణం జరిగింది. స్నేహితులే కదా అని నమ్మి కంబైన్డ్ స్టడీస్ కోసం ఇంటికి వెళ్లిన ఇద్దరు అమ్మాయిలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నవాడా నగరంలో ఒక యువతి కుటుబంతో కలిసి నివాసముంటోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె కాలేజీకి సెలవు పెట్టింది. త్వరలో పరీక్షలు మొదలుకానుండడంతో ఆరోజు జరిగిన క్లాస్ నోట్స్ తీసుకోవడానికి పక్క వీధిలో ఉంటున్న తన స్నేహితుడు ఆబీద్ కు ఫోన్ చేసింది. అందుకు అతడు తన దగ్గర ఒకటే బుక్ ఉందని ఇంటికి వస్తే కంబైన్డ్ స్టడీ చేద్దామని ఆహ్వానించాడు. దీంతో ఆ యువతి తనతో పాటు మరో స్నేహితురాలిని కూడా వెంట బెట్టుకెళ్లింది. అయితే, అక్కడ తన ఫ్రెండ్ ఆబీద్ తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. యువతులకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి వారికి తాగమని ఆఫర్ ఇవ్వగా, వారు కొంచం తాగారు. దీంతో వారు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

ఒకరి తరువాత ఒకరు ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు కూడా. అయితే ఓ యువతి మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif