Viral News: నా భర్త రోజూ స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టుకు భార్య.. స్నానానికి గంగాజలం ఉంటే బాగుండన్న భర్త..!

వారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది.

Representative Image (Photo Credit- Wikimedia Commons)

Newdelhi, Sep 16: వారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు (Divorce) కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది. యూపీలోని (UP) ఆగ్రాకు చెందిన సదరు మహిళ తన భర్త రోజూ స్నానం చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని వాపోయింది. అధికారులు  కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పరిశుభ్రంగా ఉండటానికి భర్త ఎట్టకేలకు  అంగీకరించాడు. అయినా అతడితో కలిసి ఉండటానికి సదరు భార్య విముఖత వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు.

జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

తొలుత భర్త ఏం చెప్పాడంటే?

స్నానంపై ప్రశ్నించిన అధికారులతో సదరు భర్త స్పందిస్తూ తాను సాధారణంగా నెలకు ఒకసారో, రెండుసార్లో స్నానం చేస్తానని చెప్పాడు. ఎందుకని అడిగితే.. స్వచ్చమైన నీటితోనే తాను స్నానం చేయడానికి ఇష్టపడుతానని, గంగాజలం ఉంటే బాగుండని అనడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement