Baby Boy For Sonam Kapoor: మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్‌కపూర్, సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్ట్ చేసిన సోనమ్, వైరల్ అవుతున్న సోనమ్ పోస్ట్, బాలీవుడ్ నుంచి అభినందనలు
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor), ఆనంద్ అహుజాలు (Anand Ahuja) 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ (baby bump)ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు ప్రకటించింది.
Mumbai, AUG 21: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor), ఆనంద్ అహుజాలు (Anand Ahuja) 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ (baby bump)ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి (Baby Boy For Sonam Kapoor) జన్మనిచ్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో.. ”ఆగస్టు 20, 2022.. మా బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్స్, నర్సులు, కుటుంబసభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రారంభం మాత్రమే, మా బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు. ఇట్లు మీ సోనమ్-ఆనంద్” అని పోస్ట్ చేసింది సోనమ్ కపూర్. దీంతో నెటిజన్లు, అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.