Sarkaru Vaari Paata Title Song Video: యూట్యూబ్‌ని షేక్ చేస్తోన్న సర్కారు టైటిల్ సాంగ్, విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లో నిలిచిన సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది.

Mahesh Babu Sarkaru Vaari Paata (Photo-Twitter)

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...' అంటూ సాగే లిరిక్స్ కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్టవగా... తాజా టైటిల్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లో టైటిల్ సాంగ్ రికార్డులతో దూసుకుపోతోంది. కళావతి, పెన్నీ సాంగ్ రికార్డులను తిరగరాసే విధంగా సాంగ్ ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement