Mahesh Babu: గుంటూరు కారం తెలుగులో నా చివరి సినిమా అంటున్న మహేష్ బాబు, ఒక్కసారిగా షాక్ అవుతున్న అభిమానులు, అలా ఎందుకు చెప్పాడంటే..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం

Mahesh Babu (photo-X)

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్‌ సాంగ్స్‌ ఉండాలనుకున్నామని అన్నారు.

కుర్చి సాంగ్‌.. నా కెరీర్‌ బెస్ట్‌ కావాలని శేఖర్‌ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్‌ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్‌ చేయడానికి మొదట్లో టెన్షన్‌ పడ్డాను. నెక్లెస్‌ పాట షూటింగ్‌ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్‌ వచ్చింది.నా కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌ ఇదే’ అని మహేశ్‌ అన్నారు.

మహేశ్‌బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడం గ్యారెంటీ. దీంతో మహేశ్‌ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉండాల్సి రావొచ్చు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement