Ram Charan: వీడియో ఇదిగో, అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసిన రాంచరణ్, సెల్ఫీలు దిగేందుకు పోటెత్తిన అభిమానులు
రాచంరణ్ అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు అనే విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను ఆయన వేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంతో నిష్ఠగా ఉంటారు.

అయ్యప్ప దీక్ష సమయంలో చరణ్ కూడా కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అక్కడి అభిమానులను ఆకర్షించింది.మరోవైపు రామ్ చరణ్ సిద్ధి వినాయక ఆలయానికి వచ్చారనే వార్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు క్షణాల్లో పాకింది. ఆయనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారిని నిలువరించడానికి సెక్యూరిటీ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు.
అభిమానుల మధ్య నుంచి వెళ్లడానికి చరణ్ చాలా ఇబ్బంది పడినప్పటికీ... అందరికీ నవ్వుతూ అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక యాడ్ షూటింగ్ కోసం చరణ్ ముంబైకి వెళ్లారు.
Here's Video