Tirthanand Rao Threatens to Suicide: ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ప్రముఖ హాస్యనటుడు ఆత్మహత్యాయత్నం, సహజీవనం చేసిన మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు

బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.

Tirthanand Rao Threatens to Suicide

బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలని వీడియోలో అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement