BJP Leader Murder: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి..

యూపీలోని (Uttar Pradesh)లోని సంభాల్‌ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.

Anuj Chaudhary Murder. (Photo Credits: Twitter Video Grab)

యూపీలోని (Uttar Pradesh)లోని సంభాల్‌ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు.అనుజ్‌ చౌదరి ( Anuj Chaudhary) (34) గురువారం సాయంత్రం సమయంలో మొరదాబాద్‌ (Moradabad)లోని తన అపార్ట్‌మెంట్‌ వద్ద ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు.

అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్‌ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్‌ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతనకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు (Police) వెల్లడించారు.ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమిత్‌ చౌదరి, అనికేత్‌లు అనుజ్‌ చౌదరి కుటుంబ సభ్యులే అని అనుమానిస్తున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement