Bigg Boss Telugu 8 Day 59: బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ల మ‌ధ్య తారాస్థాయికి గొడవలు, వీడియో ఇదిగో..

బిగ్‌బాస్ 8 (Bigg Boss Telugu 8) తెలుగు కంటెస్టెంట్ల మ‌ధ్య నిదానంగా గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్ప‌టికే షో ప్రారంభ‌మై 60 రోజులు కావొస్తుండ‌డం, ఇంకా 40 రోజులే మిగిలి ఉండ‌డంతో పోటీదారులు ఎవ‌రికి వారే సొంత ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ముందుకు సాగ‌తున్నారు

Bigg Boss Telugu 8 Day 59

బిగ్‌బాస్ 8 (Bigg Boss Telugu 8) తెలుగు కంటెస్టెంట్ల మ‌ధ్య నిదానంగా గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్ప‌టికే షో ప్రారంభ‌మై 60 రోజులు కావొస్తుండ‌డం, ఇంకా 40 రోజులే మిగిలి ఉండ‌డంతో పోటీదారులు ఎవ‌రికి వారే సొంత ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ముందుకు సాగ‌తున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం (అక్టోబర్ 29) నాడు జ‌రిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల‌కు ఇచ్చిన‌ బీబీ ఇంటికి దారేది అనే టాస్క్‌పెద్ద ర‌చ్చే చేసింది.

ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌ను నాలుగు టీములుగా ఏర్పాటు చేసి వారి మధ్య లూడో తరహాలో గేమ్‌ను ఆరంభించి గెలిచినవాళ్లు డైస్ వేస్తూ ముందుకు సాగాలని తెలిపాడు. పానిపట్టు యుద్ధం అంటూ బిగ్‌బాస్ 8 (Bigg Boss Telugu 8) మ‌రో టాస్క్ ఇవ్వ‌గా బ్లూ టీమ్ మెంబర్ నిఖిల్ రెడ్ టీమ్ మెంబ‌ర్స్‌ గౌతమ్, యష్మీ, ప్రేరణల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. అవ‌త‌లి వారితో ఆదో టైపులో ప్ర‌వ‌ర్తిస్తూ ఫిజిక‌ల్‌గా అటాకింగ్ గేమ్ ఆడగా యష్మీ మాత్రం బాగా డిఫెండ్ చేసి నీళ్లు వృథా కాకుండా మంచి పోటీ ఇచ్చింది.

Contestants Clash During Panipat Yuddham Task 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement