Cow Attacks Girl Video: రోడ్డు మీద వెళుతున్న స్కూలు చిన్నారిపై కొమ్ములతో దాడి చేసిన గేదె, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో స్కూలు చిన్నారి గల్లీలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా పక్కన వెళుతున్న రెండు గేదెలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. చిన్నారికి కిందపడేసి కొమ్ములతో పొడుస్తూ భీభత్స వాతావరణాన్ని సృష్టించాయి.

Cow Attacks Girl in Chennai Video Cattle Lifts Student With its Horns and Throws Her on Ground, Terrifying Clip Surfaces

సోషల్ మీడియాలో గతేడాది జరిగిన  ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో స్కూలు చిన్నారి గల్లీలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా పక్కన వెళుతున్న రెండు గేదెలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. చిన్నారికి కిందపడేసి కొమ్ములతో పొడుస్తూ భీభత్స వాతావరణాన్ని సృష్టించాయి. పక్కన ఉన్నవారు గేదె ఉగ్రరూపం చూి భయంతో దగ్గరకు రాకుండా దూరం నుంచి అదిలించే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ ఆ గేదె చిన్నారిని అదే పనిగా కొమ్ముతో పొడుస్తూ భయాందోళనకు గురి చేసింది. కొంచెం సేపటికి కర్రతో ఒ వ్యక్తి దాన్ని తరమడంతో అది అక్కడ నుంచి వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ వీడియోని జర్నలిస్టు దీపికా నారాయణ భరద్వాజ్ తన ఎక్స్ లో షేర్ చేశారు. చాలా ఆందోళన కలిగించే వీడియో. దయచేసి రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ జంతువులను ఆటపట్టించడానికి ఎవరినీ ముఖ్యంగా పిల్లలను ఎప్పుడూ చేయవద్దు లేదా అనుమతించవద్దంటూ క్యాప్సన్ ఇచ్చారు. ఈ ఘటన గతేడాది తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో చోటు చేసుకుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif