Couple Romance on Bike: మళ్లీ బైక్‌పై జంట రొమాన్స్ వీడియో వైరల్, వేగంగా వెళుతున్న బైక్ మీద ముద్దులు పెట్టుకుంటూ హల్‌చల్, చివరకు ఏమైందంటే..
మళ్ళీ వీధిలో విన్యాసాల మధ్య రొమాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ఢిల్లీ, నోయిడా కాదు. రాజస్థాన్‌లో కపుల్స్ రోడ్డు మీద సరసాలు ఆడుతూ కనిపించారు. కోట వీధుల్లో మోటర్‌బైక్‌పై వెళుతున్నప్పుడు ఒక జంట కౌగిలించుకోవడం, కొన్నిసార్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు.
Couple Romance on Bike in Rajasthan: మళ్ళీ వీధిలో విన్యాసాల మధ్య రొమాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ఢిల్లీ, నోయిడా కాదు. రాజస్థాన్‌లో కపుల్స్ రోడ్డు మీద సరసాలు ఆడుతూ కనిపించారు. కోట వీధుల్లో మోటర్‌బైక్‌పై వెళుతున్నప్పుడు ఒక జంట కౌగిలించుకోవడం, కొన్నిసార్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఈ జంట రోడ్డుపై ఇంత భయానక స్టంట్ ఎలా చేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఇంకో రొమాన్స్ వీడియో వైరల్, రోడ్డుపై వేగంగా వెళుతూ ముద్దుల్లో మునిగితేలిన జంట, రూ. 8 వేలు ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు
వీడియోపై పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్‌ను కోట ఆర్‌టీఓ ద్వారా గుర్తించడంతో ఆ వ్యక్తి జిల్లాలోని కైతున్ పట్టణానికి చెందిన మహ్మద్ వాసిమ్ (25)గా గుర్తించారు. కదులుతున్న మోటార్‌సైకిల్‌పై అసభ్యంగా ప్రవర్తించినందుకు కోటా సిటీ పోలీస్‌స్టేషన్ పోలీసులు ఆ వ్యక్తిని, మహిళ ఇద్దరినీ అరెస్టు చేశారు. సెక్షన్ 294A IPC (భారత శిక్షాస్మృతి) కింద FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేయబడింది. పోలీసుల చర్య తర్వాత నిందితులు తమ నిర్లక్ష్యపు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారు.
Here's Videos