Covid in India: దేశంలో తగ్గేదేలే అంటున్న కరోనా, గత 24 గంటల్లో 11,109 మందికి పాజిటివ్, కొత్తగా 20 మంది మృతి, 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మంది వైరస్ బారినపడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 9 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి

Covid in India (PIC @ PTI)

గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మంది వైరస్ బారినపడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 9 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ పెరుగుదలతో క్రియాశీల కేసుల సంఖ్య 49,622(0.11శాతం)కి చేరింది. రికవరీ రేటు 98.70శాతంగా నమోదైంది. కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement