COVID-19 Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించిన సీరం, రాబోయే మూడు నెలల్లో ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని లక్ష్యం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ రాబోయే మూడు నెలల్లో ఆరు నుంచి ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ వద్ద కోవోవాక్స్‌ వాక్సిన్‌ ఆరు మిలియన్ల డోస్‌ స్టాక్‌ ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు

Covishield (Photo-Twitter)

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ రాబోయే మూడు నెలల్లో ఆరు నుంచి ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ వద్ద కోవోవాక్స్‌ వాక్సిన్‌ ఆరు మిలియన్ల డోస్‌ స్టాక్‌ ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

అమెరికా కంపెనీ నోవోవాక్స్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ను కోవోవాక్స్‌ పేరుతో సీరమ్‌ ఉత్పత్తి చేస్తున్నది. అలాగే ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ను కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేస్తున్నది. ఇప్పటికే పెరుగుతున్న కొవిడ్‌ కేసుల మధ్య బూస్టర్‌ డోస్‌ తీసుకోవడంతో పాటు వృద్ధులు తప్పనిసరిగా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధార్‌ పూనావాలా విజ్ఞప్తి చేశారు

Here's PTI News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement