Covid in India: దేశంలో మొదటిసారిగా బీఏ.4, బీఏ.5 ఉనికి గుర్తింపు, గత 24 గంటల్లో 2022 మందికి కరోనా, 14,832 కేసులు యాక్టివ్
దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి
దేశంలో గత 24 గంటల్లో 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 46 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 1,92,38,45,615 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో ఆదివారం ఒకేరోజు 8,81,668 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది. కాగా, దేశంలో మొదటిసారిగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లయిన బీఏ.4, బీఏ.5 ఉనికిని గుర్తించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ తరహా కేసులు రెండు నమోదయ్యాయని వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)