Covid in India: దేశంలో గత 24 గంటల్లో 3207 కరోనా కేసులు, మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌

దేశంలో గత 24 గంటల్లో 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 29 మంది కరోనాకు బలయ్యారని, 3410 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus

దేశంలో గత 24 గంటల్లో 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 29 మంది కరోనాకు బలయ్యారని, 3410 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగిందని చెప్పింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 190.34 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, 84.10 కోట్ల టెస్టులు నిర్వహించామని తెలిపింది. గత 24 గంటల్లో 3,36,776 మందికి పరీక్షలు చేశామని పేర్కొన్నది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement