Delhi Blast: వీడియో ఇదిగో, ఢిల్లీలో బాంబు మోత, ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు, మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఘటన, పలువురికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. సమీపంలోని షాపులు కూడా ధ్వంసమయ్యాయి.
కొందరు వ్యక్తులు గాయపడగా వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు తెలుస్తున్నది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేశారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు కారణాన్ని తెలుసుకోనేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Delhi Blast Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)