Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, మెట్రోలో బట్టలు చినిగేలా తన్నుకున్న యువకులు, చర్యలు తీసుకుంటామని తెలిపిన ఢిల్లీ మెట్రో అధికారులు

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు.

Metro (Photo-Twitter)

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.

ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర‍్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది.

Fight Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now