Covid in India: మళ్లీ పెరుగుతున్న కేసులు, దేశంలో తాజాగా 3,377 మందికి కరోనా, గత 24 గంటల్లో 2496 మంది కోలుకోగా, 60 మంది మృతి

దేశంలో తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి. ఇందులో 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 5,23,753 మంది మృతిచెందగా, 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకోగా, 60 మంది మరణించారు.

Coronavirus test (Photo-ANI)

దేశంలో తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి. ఇందులో 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 5,23,753 మంది మృతిచెందగా, 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకోగా, 60 మంది మరణించారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం ఢిల్లోనే ఉన్నాయి. దేశరాజధానిలో నిన్న ఒక్కరోజే 1490 కరోనా కేసులు రికార్డయ్యాయి.

కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.04 శాతం ఉన్నాయని, 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.22 శాతం మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 1,88,65,46,894 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో గురువారం ఒక్కరోజే 22,80,743 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement