Coronavirus in India: దేశంలో మళ్లీ పెరుగుతున్నకేసులు, గత 24 గంటల్లో 2,539 మందికి కరోనా, డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతం
గత వారం రోజుల నుంచి మూడు వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 100 లోపే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,539 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. గత వారం రోజుల నుంచి మూడు వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 100 లోపే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,539 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 60 మంది మరణించగా, 4,491 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 30,799 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 5,16,132 మంది ప్రాణాలు కోల్పోయారు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)