Janasena Leader on Allu Arjun: వీడియో ఇదిగో, నువ్వో పెద్ద కమెడియన్ అంటూ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన జనసేన నేతలు, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ..
అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు.
అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు. నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు
ఎన్నో సంఘసేవలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి. నువ్వు నీడ నిచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావు. నువ్వు మీ నాన్న కనీసం పిల్లికి కూడా బిక్షం వెయ్యరు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్, కళ్యాణ్ నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. డిసెంబర్ నెలలో నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూపిస్తా. కనీసం నీ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరని మండిపడ్డారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)