Lady Aghori: వీడియో ఇదిగో, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న లేడీ అఘోరి, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశం వదిలి పారిపోవాలని బెదిరింపులు
లేడీ అఘోరి మళ్లీ హల్ చల్ చేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. అదిలాబాద్ జిల్లా నెన్నెల్ మండలం కుషేనపల్లి గ్రామానికి చెందిన యెల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి ముస్లింలు, క్రైస్తవులను ఊచకోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లేడీ అఘోరి మళ్లీ హల్ చల్ చేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. అదిలాబాద్ జిల్లా నెన్నెల్ మండలం కుషేనపల్లి గ్రామానికి చెందిన యెల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి ముస్లింలు, క్రైస్తవులను ఊచకోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఉండాలనుకుంటే హిందువులుగానే ఉండండి, లేకపోతే ఎక్కడికైనా పారిపోండి.. వదలను, ఊచకోత కోస్తానంటూ ముస్లింలు, క్రైస్తవులకు బెదిరింపుల వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, చట్టాలు తనకు వర్తించవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్న ఉన్మాదిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ.. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల ప్రశ్న.. స్మశాన వాటికలో ఉన్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు..వీడియో ఇదిగో
Lady Aghori is inciting communal hatred and terrorizing people
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)