Lockdown in Tamil Nadu: తమిళనాడులో లాక్‌డౌన్‌, మే 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన స్టాలిన్ సర్కారు, మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి

తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ మే 10 నుంచి అమల్లో ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల మే 10 నుంచి 2వారాలపాటు లాక్‌డౌన్ కొనసాగనుంది.

COVID-19 lockdown (Photo Credit: PTI)

శుక్రవారం సీఎం స్టాలిన్‌ కలెక్టర్లతో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ నెల 10న ఉదయం 4 గంటల నుంచి మే 24 తేది ఉదయం 4 గంటల వరకు తమిళానాడులో పూర్తి లాక్‌డౌన్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని​ ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌లో బ్యాంకులు (50 శాతం సిబ్బందితో), రేషన్ షాపులకు అనుమతి ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్లలో పార్సిల్‌ సౌకర్యం ఉంటుందని.. క్యాబ్‌లు, ఆటో సేవలు కేవలం ఆస్పత్రి, వివాహ, అంత్యక్రియకు మాత్రమే అనుమతిస్తున్నట్లు లాక్‌డౌన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement