Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిపోయిన 8 ఏళ్ళ బాలుడు, ఆహారం కూడా అందించే పరిస్థితి లేని వైనం, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలో 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మూడు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి. బోరుబావిలో బాలుడి కదలికలు గమనించి అతడు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధరించుకున్నాయి.
అనంతరం అతడ్ని బయటకు తీసుకొచ్చేందుకు బోరుబావికి సరిసమానంగా తవ్వాయి. అతడు 43-44 అడుగుల వద్ద చిక్కుకుని ఉన్నాడని, కొద్ది గంటల్లో బయటకు తీసుకువస్తామని సహాయక సిబ్బంది తెలిపారు. బాలుడి కదలికలు గుర్తించినప్పటికీ.. అతనితో మాట్లాడలేకపోయినట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి ఆహారం కూడా అందించే పరిస్థితి లేదన్నారు. వీలైనంత త్వరగా అతడ్ని బయటకు తీసుకొచ్చాక ఆహారం అందించి, ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)