TDP Leader JC Prabhakar Reddy angry on Perni Nani(X)

Vjy, Jan 2: తాడిపత్రిలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి  నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్,బిజెపి, విహెచ్ పి నాయకులపై  తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమం పై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు థర్డ్ జెండర్ కంటే ఇంకా తగ్గు నా కొడుకులంటూ జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అనంతపురంలో తన బస్సులు పథకం ప్రకారం దగ్ధం చేసినా పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంపై జేసీ పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేతకాదు కాబట్టే నేను ఫిర్యాదు చేయలేదు, మీకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి నా బస్సులు పథకం ప్రకారం నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసుల పై నాకు నమ్మకం లేదు,

మీకు నిందితులు ఎవరో పట్టుకునేకి చేతకాదు కాబట్టే షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వం లో 450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని, ఇప్పుడు రెండు బస్సులు అంటిస్తే ఏమి అవుతుందంటూ  జెసి అన్నారు.

వీడియో ఇదిగో, జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు, పూర్తిగా కాలిపోయిన వాహనం

JC Prabhakar Reddy Reacts on His Travels Bus Fire

వీరి కంటే వైఎస్ జగన్  చాలా మేలని,  జగన్ తన ప్రభుత్వంలో కేవలం బస్సులు మాత్రమే నిలబెట్టాడని , మీ బిజెపి ప్రభుత్వంలో నా బస్సులు తగలబెట్టిచారని జెసి సంచలన ఆరోపణలు చేశారు.