 
                                                                 Mumbai, JAN 03: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) నూతన సంవత్సర ఆఫర్ కింద తమ ఫ్లాగ్‌షిప్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ (Honda Elevate SUV), హోండా సిటీ (Honda City), హోండా హైబ్రీడ్ (Honda Hybrid) సెడాన్ కార్లపై రాయితీలు ప్రకటించింది. గరిష్టంగా రూ.90 వేల వరకూ డిస్కౌంట్‌లు ఆఫర్ చేసింది. ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు వర్తిస్తాయి. గత నెలలో మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ జనరేషన్ అమేజ్ సబ్ కంపాక్ట్ (Honda Amaze)సెడాన్ కారుపై డిస్కౌంట్ లేదు. కానీ పాత మోడల్ హోండా అమేజ్ మీద డిస్కౌంట్ కొనసాగుతుంది.
ఈ నెల ఒకటో తేదీ నుంచి తన కార్లపై రెండు శాతం ధరలు పెంచుతామని ఇంతకు ముందే హోండా కార్స్ ప్రకటించింది. ధరల పెంపును అధికారికంగా వెల్లడించలేదు. హోండా ఎలివేట్ (Honda Elevate), హోండా సిటీ (Honda City), హోండా సిటీ హైబ్రీడ్ (Honda City Hybrid) కార్లపై ధర పెరుగనున్నది.
హోండా సిటీ హైబ్రీడ్ (Honda City Hybrid) సెడాన్ కారుపై గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ, ఎక్స్చేంజ్ బెనిఫిట్ తదితర రూపాల్లో రూ.90 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ విర్టస్, హ్యుండాయ్ వెర్నాలతో పోటీ పడుతున్న ఫిఫ్త్ జనరేషన్ సిటీ కారుపై రూ.73,300 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
హోండా తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎలివేట్ (Honda Elevate) కారు మీద రూ.86,000 డిస్కౌంట్ అందిస్తుంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడల్ కార్లకు ఎలివేట్ పోటీనిస్తుంది. ఈ డిస్కౌంట్‌లో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బెనిఫిట్ తదితరాలు ఉన్నాయి. ఇటీవల ఆవిష్కరించిన ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ కారుపై రూ.45,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలాఖరులో ఎలివేట్ న్యూ బ్లాక్ ఎడిషన్ కారు ఆవిష్కరించనున్నది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
