Maharashtra Floods: వీడియో... మహోగ్ర రూపం దాల్చిన గోదావరి, భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి, తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు

ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Godavari River

ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి భీకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, మహారాష్ట్రలో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నదికి వరద పోటెత్తడంతో పలు ఆలయాలు నీటమునిగాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement