Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్
ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు అదిరిపోయే స్టైలిష్ లుక్ తో కనపడ్డాడు. రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేశ్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేశాడు.
అయితే వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనే వివరాలు మాత్రం తెలియదు. నేడు ఉదయం మహేశ్ – నమ్రత కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. దీంతో మహేశ్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేశ్ స్టైలిష్ హుడీ వేసుకుని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని రఫ్ గడ్డం, లాంగ్ హెయిర్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)