Mahesh Babu on Konda Surekha Comments (Photo-X)

నాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే హీరోలు స్పందించగా తాజాగా నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మా సినిమా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయి అని పేర్కొన్నారు.

కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్, కేసీఆర్‌ కనబడట్లేదు..కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడనే అనుమానం ఉందన్న సురేఖ..వీడియో ఇదిగో

ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఓ తల్లికి కొడుకుగా... ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర వేదనకు గురిచేశాయని, ఆమె ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఎదుటివారి మనోభావాలను గాయపర్చనంత వరకు మనకు వాక్‌స్వాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు.

Here's Tweet

ఇలాంటి చవకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని, సినిమా వాళ్లే కదా అని చులకనగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలోని మహిళలను, సినిమా పరిశ్రమ వారిని గౌరవించాలని సూచించారు.