Ola Gen 3 Electric Scooter: ఓలా నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు, జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన సీఈఓ భవీశ్ అగర్వాల్
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా మరో మూడు నయా స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు. అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్, నూతన డిజైనింగ్ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా మరో మూడు నయా స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు. అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్, నూతన డిజైనింగ్ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు.వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో వీటిని తీసుకురావాలని తొలుత భావించినప్పటికీ.. తన ప్రణాళికను మార్చుకుంది.
రెండో తరంతో పోలిస్తే మూడోతరం స్కూటర్లు డిజైన్, ఫీచర్లతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తాయని భవీశ్ పేర్కొన్నారు. వీటి ద్వారా మరోసారి ఇండస్ట్రీని సర్‌ప్రైజ్ చేయబోతున్నామని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తదుపరి తరం స్కూటర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు థర్డ్ పార్టీ సప్లయర్ల నుంచి విడి భాగాలను సేకరిస్తూ వచ్చిన ఆ సంస్థ.. వాటిని సొంతంగా రూపొందించుకునేందుకు నిర్ణయించింది. జనరేషన్ 3 టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తమ మార్జిన్లు సైతం 20 శాతం మేర పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.
Ola to unveil Gen 3 electric scooter