Mumbai, JAN 24: కొత్త స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ యాక్టివా (New Activa) వచ్చేసింది. ఈ కొత్త మోడల్ స్కూటర్ (OBD2B)-కంప్లైంట్ వెర్షన్‌గా లాంచ్ అయింది. భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్, హీరో జూమ్‌లకు పోటీగా మరిన్ని ఫీచర్లతో హోండా యాక్టివా 2025 వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ హోండా స్కూటర ధర విషయానికి వస్తే.. రూ. 80,950 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీ-అప్‌డేటెడ్ మోడల్ అయితే రూ. 2,266 తక్కువ ధరతో రూ.78,684 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.
హోండా యాక్టివా 2025 మోడల్ (Honda Activa 2025) 109.51cc, సింగిల్-సిలిండర్ PGM-Fi ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇప్పుడు (OBD2B) నిబంధనలకు అనుగుణంగా ఉంది. గరిష్టంగా 8పీఎస్ పవర్, 9.05Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే.. యాక్టివా 2025 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. హోండా రోడ్‌సింక్ యాప్‌కు సపోర్టు చేస్తుంది. నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్‌ల వంటి ఫంక్షన్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు.
ఈ హోండా స్కూటర్ ఇప్పుడు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో కూడా అమర్చారు. టాప్-స్పెక్ హెచ్-స్మార్ట్ కాకుండా మిడ్-స్పెక్ డీఎల్ఎక్స్ వేరియంట్‌కు కూడా అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మునుపటి మోడ్సల్ మాదిరిగా యాక్టివా 2025 మూడు వేరియంట్లలో (STD, DLX, H-Smart) అందుబాటులో ఉంటుంది. అందులో ముఖ్యంగా పెర్ల్ ప్రెషియస్ వైట్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ అనే 6 కలర్ ఆప్షన్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.