Royal Enfield Scram 440 (PIC@ X)

Mumbai, JAN 23: ప్రముఖ ద్వి చక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) భారత్‌ మార్కెట్‌లో తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ ఆవిష్కరించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాం 411 (Scram 411) స్థానే స్క్రాం 440 తీసుకు వచ్చింది. దీంతో ఏడీవీ క్రాస్‌ఓవర్‌ మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో (ADV Crossover) గట్టి పోటీ ఇవ్వనున్నది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ శక్తిమంతమైన లాంగ్‌ స్ట్రోక్‌ 443సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది.

Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌ తయారు చేసిన టీవీఎస్‌, ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 226 కి.మీ మైలేజ్‌ 

ఈ ఇంజిన్ గరిష్టంగా 4000 ఆర్పీఎం వద్ద 34 ఎన్‌ఎం టార్క్‌, 6,250 ఆర్పీఎం వద్ద 25.4 హెచ్‌పీ విద్యుత్‌ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. స్క్రాం 411 (Scram 411) లో మాదిరిగా ఉన్నా, స్క్రాం440 చేసిస్‌ స్వల్పంగా బరువుగా 795ఎంఎం ఎత్తు, 200 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో వస్తోంది.

Royal Enfield Launches Scram 440

 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ ఆల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌ ఫర్ ఇంప్రూవ్డ్‌ విజిబిలిటీ, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా 15- లీటర్ల ఫ్యుయల్‌ ట్యాంక్‌, స్విచ్చబుల్‌ ఏబీఎస్ ఉంటాయి. ఫ్రంట్‌లో 100/90 ప్రొఫైల్‌ 19- అంగుళాల టైర్‌, రేర్‌లో 120/90 ప్రొఫైల్‌ 17- అంగుళాల టైర్‌ ఉంటాయి. రేర్‌లో మోనోషాక్‌, ఫ్రంట్‌లో 41ఎంఎం సస్పెన్షన్‌ సెటప్‌ ఉంటాయి. 2025 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాం 440 (2025 Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ ధర రూ.2.08 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మోటారు సైకిల్ ట్రయల్‌, ఫోర్స్‌ వేరియంట్లలో లభిస్తుంది.